Twitter Bird: ”ట్విట్టర్ పిట్ట వేపుడు”.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. అసలు కథేంటో తెలుసా.?

|

Aug 17, 2021 | 4:56 PM

Twitter Bird: ట్విట్టర్ పిట్ట వేపుడు ఏంటి.? ఢిల్లీకి పార్శిల్ ఏంటని ఆలోచిస్తున్నారా.? ఈ స్టోరీ చదవండి మీకు అంతా అర్ధమవుతుంది...

Twitter Bird: ట్విట్టర్ పిట్ట వేపుడు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. అసలు కథేంటో తెలుసా.?
Twitter
Follow us on

ట్విట్టర్ పిట్ట వేపుడు ఏంటి.? ఢిల్లీకి పార్శిల్ ఏంటని ఆలోచిస్తున్నారా.? ఈ స్టోరీ చదవండి మీకు అంతా అర్ధమవుతుంది. ఢిల్లీలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసినందుకు గానూ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దానికి వివరణ ఇస్తూ.. నిబంధనలు ఉల్లంఘించినందుకే రాహుల్ ఖాతాను బ్లాక్ చేశామని సంస్థ పేర్కొంది. రాహుల్ గాంధీ ట్విట్టర్ అన్‌లాక్ అయినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది.

అయితే ట్విట్టర్ చర్యకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ నాయకులైతే ఇంకాస్త ముందడుగు వేసివినూత్న ఆలోచనకు తెరలేపారు. ఆ పార్టీ నేత హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్, అనుచరులు ట్విట్టర్ పిట్ట వేపుడును చేసి ఢిల్లీలోని ట్విట్టర్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌కు పార్శిల్ చేశారు.

”రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిలిపేసి ట్విట్టర్ నిర్వాహకులు తప్పు చేశారు. అలాగే కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు.బీజేపీ చేసిన కుట్రతోనే ట్విట్టర్ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు”