CM YS Jagan: దివంగత డా. గంగిరెడ్డికి పులివెందుల ఘాట్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఘన నివాళి

కడప జిల్లా దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఇవాళ పులివెందులలో ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధి తోటలో

CM YS Jagan: దివంగత డా. గంగిరెడ్డికి పులివెందుల ఘాట్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఘన నివాళి

Updated on: Oct 03, 2021 | 12:28 PM

AP CM YS Jagan Family Tribute: కడప జిల్లా దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఇవాళ పులివెందులలో ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధి తోటలో ఉన్న డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యామిలీ తమ నివాళులర్పించింది. సీఎం జగన్ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, ఇతర వైఎస్‌ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం పులివెందులలో ఉన్న భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్‌ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారని ఈ సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకున్నారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకమన్నారు.

ఇలాఉండగా, నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిన్ననే కడప జిల్లాకు చేరుకున్నారు. క‌డప‌ ఎయిర్‌పోర్టు, ఇడుపుల‌పాయ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైయ‌ఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు స్వాగ‌తం ప‌లికారు.

Read also: Etela – Huzurabad: ఈటలే హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి.. వెలువడిన అధికారిక ప్రకటన