AP CM YS Jagan: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఫిర్యాదు!

|

Jul 05, 2021 | 1:36 PM

జల జగడంపై మరోసారి కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

AP CM YS Jagan: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఫిర్యాదు!
Ap Cm Ys Jagan Written Letter To Union Ministers (file)
Follow us on

AP CM YS Jagan wrote letter to Union Ministers: జల జగడంపై మరోసారి కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావాత్‌కు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు విడివిడిగా లేఖలు రాశారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, నీటి వాడకం, విద్యుత్ ఉత్పత్తిపై 4 పేజీలతో లేఖ రాశారు. శ్రీశైలంలో 834 అడుగులకు కింద నీటి మట్టం ఉన్నా ఉత్పత్తి ఆపడం లేదని, కృష్ణా బోర్డు చెప్పినా వినడం లేదని తెలంగాణపై ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని, ఆ రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్ట్‌లను, నీటి వాడకాలను పరిశీలించిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ను KRMB సందర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని సీఎం జగన్‌ కోరారు. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ప్రకాశ్‌ జవదేవకర్‌కు లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్.
do 43AP CM YS Jagan letter to gajendra singh shekhawat
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి రాసిన లేఖలో.. రాయలసీమ ఎత్తిపోతల పథకంకు వీలైనంత త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు. జూన్ 30న రాయల సీమ ఎత్తపోతలకు సంభందించిన డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి అప్‌లోడ్ చేశామని లేఖలో పేర్కోన్నారు. రాయలసీమ ఎత్తపోతల పథకం కోసం ఎలాంటి భూసేకరణ చేయడంలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అటవీప్రాంతం కానీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానీ అడ్డంకులు లేవని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకం పర్యావరణ పరిరక్షణ జోన్‌కు పదికిలోమీటర్లు బయట నిర్మించతలపెడుతున్నామని సీఎం జగన్ వివరించారు.
DO 44AP CM YS Jagan letter to Prakash javadekar

Read Also… Pileru politics: చిత్తూరు జిల్లాలో రూ.400 కోట్ల భూ కుంభకోణం.. వైసీపీ నేతలపై నల్లారి కిశోర్ సంచలన ఆరోపణలు..!