Andhra Pradesh: కొత్త గవర్నర్‌ నజీర్‌కు సాదర స్వాగతం పలికిన సీఎం జగన్‌.. 24న ప్రమాణ స్వీకారం

|

Feb 22, 2023 | 9:24 PM

ఏపీ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి జగన్‌ కొత్త గవర్నర్‌ నజీర్‌కు సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులోనే మంత్రులు, అధికారుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: కొత్త గవర్నర్‌ నజీర్‌కు సాదర స్వాగతం పలికిన సీఎం జగన్‌.. 24న ప్రమాణ స్వీకారం
Cm Jagan
Follow us on

ఏపీ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి జగన్‌ కొత్త గవర్నర్‌ నజీర్‌కు సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులోనే మంత్రులు, అధికారుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ దగ్గరుండి అధికారులను, మంత్రులను కొత్త గవర్నర్‌కు పరిచయం చేశారు. ఎల్లుండి గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. కాగా విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం. ఇక సుప్రీం న్యాయమూర్తిగా నజీర్ ట్రాక్ రికార్డులు పరిశీలిస్తే.. ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు.

ట్రిపుల్ తలాక్, అయోధ్య- బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనార్టీ న్యాయమూర్తి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..