AP CM Jagan: రేపు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్..

|

Oct 17, 2021 | 4:03 PM

AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 18) విజయవాడ పటమట దత్తానగర్‌లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని..

AP CM Jagan: రేపు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్..
Cm Jagan
Follow us on

AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 18) విజయవాడ పటమట దత్తానగర్‌లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించనున్నారు.  ఆశ్రమంలోని ​​రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.  సీఎం జగన్ ఆశ్రమానికి రానుండడంతో.. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ , ఇతర పోలీసు అధికారులు ఆశ్రమాన్ని సందర్శించి ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జరుగుతున్న ఏర్పాట్లు,  భద్రతా చర్యలను పరిశీలించారు.

ఈ పర్యటన కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు ఆశ్రమం చేరుకుంటారు. అనంతరం 10.50 వరకు అంటే 20 నిమిషాల పాటు ఆశ్రమంలోని  దేవాలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తరువాత, అతను స్వామి గణపతి సచ్చిదానందతో సమావేశం కానున్నారు. భేటీ ముగిసిన అనంతరం తిరిగి 11.30 గంటలకు తాడేపల్లికి  పయనం కానున్నారు.

Also Read: భోగాలు కేవలం భౌతిక సంపదలు.. వాటిని ఉచితంగా కాకుండా కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాని తెలిపే కథ