Jagananna Amma Vodi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి, 9గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. విమానంలో విశాఖపట్నం చేరుకొని, అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన కోడి రామ్మూర్తి స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు సీఎం జగన్. 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు జరిగే బహిరగంసభలో మాట్లాడతారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు బటన్ నొక్కుతారు. వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి విశాఖ చేరుకొని మళ్లీ తాడేపల్లికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. విద్యార్థులను బడి బాటపట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద, చిన్నారుల తల్లుల ఖాతాలో ఏటా 15 వేలు జమ చేస్తోంది, జగన్ ప్రభుత్వం. ఈ ఏడాదికి సంబంధించి, అమ్మ ఒడి నిధులను ఇవాళ విడుదల చేయనుంది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో 6వేల 595 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఈ పథకం అమలుపై ఇటీవల విమర్శలొచ్చాయి. వాటన్నింటిపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..