AP Cm Vizag Tour: ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బుధవారం విశాఖ టూర్ సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి అధికారులు, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని అధికారులను ప్రశ్నించారు సీఎం. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేసినట్లు వార్తలొచ్చాయి. మూడు గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని నగర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులతో పలుచోట్ల గొడవ పెట్టకున్నారు. హారన్లు మోగిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సినవాళ్లు, ఆస్పత్రులకు వెళ్లాల్సినవారు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు మండుటెండలోనే గంటల తరబడి ఉండాల్సి వచ్చింది.
సీఎం జగన్ బుధవారం విశాఖ శారదా పీఠం వార్షిక వార్షికోత్సవాలకు హాజరుకావడానికి షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సి ఉండగా 11.45కు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయల్దేరాలింది.. కానీ వివిధ కార్యక్రమాల వల్ల సాయంత్రం 4 వరకు అక్కడే ఉన్నారు. అలాగే, సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసుల అతి వల్ల సామాన్యలు ఇబ్బందలు ఎదుర్కొనడంపై నారా లోకేష్ సైతం భగ్గుమన్నారు. ‘సీఎం ప్రైవేటు పర్యటన కోసం శారదాపీఠం వెళ్తే, విశాఖ ప్రజలు ఇబ్బంది పడాలా ?’ అని ప్రశ్నించారు. విమర్శలు రావడంతో సీఎం జగన్ స్పందించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Andhra Pradesh: మొక్కజొన్న లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు విషయం తెలిస్తే మతి పోతుంది