YS Jagan: లండన్ పర్యటన రద్దు..? రెండు రోజుల్లో ఢిల్లీకి సీఎం జగన్.. సీఎస్ కీలక ప్రకటన..

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ శుక్రవారం లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

YS Jagan: లండన్ పర్యటన రద్దు..? రెండు రోజుల్లో ఢిల్లీకి సీఎం జగన్.. సీఎస్ కీలక ప్రకటన..
Cm Jagan

Updated on: Apr 19, 2023 | 7:31 AM

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ శుక్రవారం లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని.. తమ పర్యటనలో సీఎం జగన్ కూడా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తారని.. ఈ సమావేశం కోసం ఆయన విదేశీ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర కార్యదర్శులతో సమావేశంతో పాటు ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన పై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శలు చేశారు.

ఇటీవల జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం నిధుల లేమి కారణంగా వాయిదా వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ సూచనల మేరకే వసతి దీవెనను వాయిదా వేశామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..