పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. మనిషి ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైద్య సేవలే కాదు.. వైద్య విద్యకు ప్రోత్సహిస్తున్నామన్నారు.
విద్య, వైద్యంలో దేశం మొత్తం ఆంధ్ర మోడల్‌ను ఫాలో అవుతుందన్నారు జగన్. ఇక్కడ మనసుపెట్టి పరిపాలన జరుగుతోందన్న సీఎం, పరిష్కారాల దిశగా తాపత్రయపడుతున్నామన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల సంఖ్య 11. గత ఐదేళ్ళ కృషి ఫలితంగా కొత్తగా సాకారమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఏకంగా 17.
కొత్తగా 17 మెడికల్ కాలేజీల ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఉచిత వైద్య భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…