YS Jagan: రూ.872కోట్ల పనులకు శంకుస్థాపన.. కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన..

YSR Kadapa district news: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన ముగిసింది. మూడో రోజు సైతం.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి..

YS Jagan: రూ.872కోట్ల పనులకు శంకుస్థాపన.. కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్‌ పర్యటన..
Ys Jagan

Updated on: Jul 10, 2023 | 8:10 PM

YSR Kadapa district news: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన ముగిసింది. మూడో రోజు సైతం.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. పలు ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొన్నారు. సొంత ఇలాఖాలో మొత్తం 872 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కడప పట్టణంలో కొత్తగా నిర్మించిన రాజీవ్‌ పార్క్‌, రాజీవ్‌ మార్గ్‌లను ప్రారంభించారు.దశాబ్దాలుగా కడప ప్రజలు తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

కడప కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఏర్పాటు చేసిన అల్‌డిక్సాన్‌‌ యూనిట్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ కంపెనీలో మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్లెట్స్‌, సెక్యూరిటీ పరికరాలు, కెమెరాలు తయారవుతాయి. ఈ యూనిట్‌ ద్వారా మూడువేల మందికి ఉపాధి లభించనుంది.

కొప్పర్తి పారిశ్రామికవాడలో నెలకొల్పనున్న మరిన్ని పారిశ్రామిక సంస్థల నిర్మాణానికి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..