విధి నిర్వ‌హ‌ణ‌లో వాలంటీర్ మృతి..‌‌.వెంట‌నే స్పందించిన‌ సీఎం జగన్..

|

May 02, 2020 | 3:10 PM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో హార్ట్ అటాక్ తో చనిపోయిన గ్రామ వాలంటీర్ ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పింఛ‌న్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మ‌రణించిన‌ వాలంటీర్‌ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వాలంటీర్ చనిపోయినట్లు తెల‌సిన వెంట‌నే స్పందించిన సీఎం.. రూ. 5లక్షల పరిహారం ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వైఎస్ జగన్ ముఖ్య‌మంత్రి కార్యాల‌య‌ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. […]

విధి నిర్వ‌హ‌ణ‌లో వాలంటీర్ మృతి..‌‌.వెంట‌నే స్పందించిన‌ సీఎం జగన్..
Follow us on

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో హార్ట్ అటాక్ తో చనిపోయిన గ్రామ వాలంటీర్ ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పింఛ‌న్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మ‌రణించిన‌ వాలంటీర్‌ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వాలంటీర్ చనిపోయినట్లు తెల‌సిన వెంట‌నే స్పందించిన సీఎం.. రూ. 5లక్షల పరిహారం ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వైఎస్ జగన్ ముఖ్య‌మంత్రి కార్యాల‌య‌ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా మ‌హ‌మ్మారి వీర‌విహారం చేస్తోన్న సమయంలో ముందుండి పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఆదుకోవాల‌ని వ్యాఖ్యానించారు. అనురాధ ఫ్యామిలీకి త‌క్ష‌ణ‌మే ఈ సహాయం అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు. ఇటు పాడేరు శాస‌న‌స‌భ్యురాలు భాగ్యలక్ష్మి కూడా చ‌నిపోయిన వాలంటీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే కూడా రూ.10వేలు వాంటీర్ కుటుంబానికి అందజేశారు.