CM Jagan Delhi tour : కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా?

ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని భావించిన ఏపీ సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు...

CM Jagan Delhi tour : కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్.. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా?
Cm Jagan

Updated on: Jun 06, 2021 | 10:50 PM

AP CM Jagan Delhi tour : ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని భావించిన ఏపీ సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ కార‌ణంగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో వ్యాక్సినేషన్ పై తన బాణీని కేంద్రానికి వినిపించాలని సీఎం జగన్ భావించారని, దాంతోపాటే రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి పనులు, విభజన హామీలపైనా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారని వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని కథనాలు వచ్చాయి. అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Read also : Malayalam : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దంటూ ఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రి సర్కులర్.. స్పందించిన రాహుల్, కేటీఆర్

Read also : Lakshmi Aparna : నెట్టింట లక్ష్మీ అపర్ణ పోలీసులపై నిరసన హల్చల్.. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదంటూ ఏసీపీ వివరణ

Read also : Poker Sites : గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట.. చిలకలూరిపేట పరిధిలో ఎస్పీ నేతృత్వంలో దాడులు.. లక్షల్లో సొమ్ములు స్వాధీనం