
సీఎం జగన్ ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన అనుభవం రెండేళ్లు. కానీ పథకాలు ప్రవేశ పెట్టడంలో.. ప్రజా రంజక పాలన సాగించడంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజల మధ్య గడిపిన అనుభవంతో ప్రజల నాడి పట్టుకున్నారు, వాళ్ల అవసరాలేంటో తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు.
ఇందులో అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ-వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.