విజయవాడ నగరంలో పీబ్ల్యూడి గ్రౌండ్ 400 కోట్ల రూపాయలతో నిర్మించిన డా.బీఆర్ అంబేద్కర్ స్మారక స్మృతివనం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే అంబేద్కర్ స్పృతి వనం పనులు పూర్తి అవ్వగా ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.
ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహా మనిషి, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహా విష్కరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా మారింది. హిందువుల పెద్ద పండగ సంక్రాంతి సంబరాలకు కొనసాగింపుగా జనవరి 19వ తేదీన విజయవాడ నగరంలోని బీడబ్ల్యూడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
బలుగు, బలహీన వర్గాలకు అండగా, ఆశజ్యోతిల వెలిగిన, బీసీ, ఎస్టీ, ఎస్సీ సహా ఇతర వర్గాల ప్రజల సమాన హక్కుల కోసం పోరాడి, భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో డా. బీఆర్. అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహ అవిష్కరణ రోజును రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని బీసీ రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ పిలునిచ్చారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ .. ఇతర వర్గాల ప్రజల తరపున ఉత్తరాంధ్ర రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మరియు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కార్త జ్యోతిరావు పూలె విగ్రహ ఏర్పాటు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అతి పెద్ద విగ్రహ ఆవిష్కరణ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. మనసున్న ముఖ్యమంత్రి.ఎస్టీ, ఎస్సీ మరియు బలహీన వర్గాల ప్రియతమ నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని బీసీ రాష్ట్ర సెల్ సభ్యుడు .. బెజవాడ రూరల్ అధ్యక్షుడు బెజవాడ గణేష్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..