CM Jagan: వై నాట్‌ 175పై తగ్గేదేలే అంటోన్న సీఎం జగన్‌.. 2024 రూట్‌మ్యాప్‌పై రీజినల్‌ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం

ముందస్తు ఎన్నికల్లేవ్‌!, మంత్రివర్గంలో మార్పులూ లేవ్‌! కానీ గేర్‌ మార్చాలి..డబుల్‌ స్పీడ్‌లో వర్క్‌ చేయాలంటూ సోమవారం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన జగన్‌, మంగళవారం రీజినల్‌ కోఆర్డినేటర్ల ముందు టార్గెట్‌ 2024 రూట్‌మ్యాప్‌ పెట్టారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు.

CM Jagan: వై నాట్‌ 175పై తగ్గేదేలే అంటోన్న సీఎం జగన్‌..  2024 రూట్‌మ్యాప్‌పై రీజినల్‌ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం
Cm Jagan

Updated on: Apr 05, 2023 | 6:30 AM

2024 టార్గెట్‌ ఆల్రెడీ ఫిక్సైంది. వై నాట్‌ 175 లక్ష్యంతో ముందుకెళ్తోంది వైసీపీ. ఎప్పుడు మీటింగ్‌ జరిగినా ఎమ్మెల్యేలకు ఇదే లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు సీఎం జగన్‌. అయితే, రీజినల్‌ కోఆర్డినేటర్ల ముందు సరికొత్త రూట్‌ మ్యాప్‌ను ముందుపెట్టారు‌. కోఆర్డినేటర్లుగా ఏం చేయాలో క్లారిటీగా చెప్పారు. ముందస్తు ఎన్నికల్లేవ్‌!, మంత్రివర్గంలో మార్పులూ లేవ్‌! కానీ గేర్‌ మార్చాలి..డబుల్‌ స్పీడ్‌లో వర్క్‌ చేయాలంటూ సోమవారం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన జగన్‌, మంగళవారం రీజినల్‌ కోఆర్డినేటర్ల ముందు టార్గెట్‌ 2024 రూట్‌మ్యాప్‌ పెట్టారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్‌పై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కార్యాచరణ నిర్దేశించారు. అలాగే, నియోజకవర్గాల్లో గ్రూప్‌ తగాదాలను పరిష్కరించి, కలిసికట్టుగా పనిచేసేలా చేయాలన్నారు సీఎం జగన్.

ఇక, ఈనెల ఏడు నుంచి ప్రారంభంకానున్న జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్‌ పోస్టర్లను రిలీజ్‌ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలతో మమేకమయ్యేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్‌ చేసినట్టు చెప్పారు. మా నమ్మకం నువ్వే జగన్‌- నినాదంతో జనంలోకి వెళ్తామన్నారు సజ్జల. మొత్తానికి వైసీపీలో వరుస మీటింగ్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయ్‌. ఎన్నికలకు ఏడాది ముందే స్పీడ్‌ పెంచేసిన వైసీపీ, నిత్యం జనంలోనే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటోంది. మరి, ఈ కార్యాచరణ.. వై నాట్‌ 175 లక్ష్యాన్ని చేరుస్తుందా? లేదా?

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us