AP CM Jagan: నేడు ఏలూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్, తొలివిడత అన్నదాతకు రైతు భరోసా చెక్కుల పంపిణీ
సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అర్హులైన అన్నదాతలకు సీఎం జగన్ ఆర్ధిక సాయం అందించనున్నారు.
AP CM Jagan: ఆంధప్రదేశ్ ప్రభుత్వం(Andhrapradesh Government) ఈ ఏడాది అన్నదాతకు సాయం అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. నేడు సీఎం వైఎస్ జగన్ నేడు ఏలూరు జిల్లా(Eluru District) గణపవరంలో పర్యటించున్నారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అర్హులైన అన్నదాతలకు సీఎం జగన్ ఆర్ధిక సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది తొలివిడతగా 50,10,275 రైతు కుటుంబాలకు ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది.
ఈ మేరకు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాంగణానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్ తొలివిడత నిధులు నేడు విడుదల చేయనుంది. గత మూడేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద ఈ ఏడాది రూ.7,020 కోట్లు కేటాయించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..