‘గత ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం జరిగింది’.. సీఎం చంద్రబాబు.

|

Jun 28, 2024 | 5:49 PM

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించామన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

గత ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం జరిగింది.. సీఎం చంద్రబాబు.
Cm Chandrababu
Follow us on

అమరావతి, జూన్ 28: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5ఏళ్ళు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించామన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ శాపంలా మారారని విమర్శించారు. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం అని వివరించారు. 2014 -19 తమ ప్రభుత్వ హయాంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.

డయాఫ్రమ్ వాల్‎ను రూ.436కోట్లతో పూర్తి చేస్తే.. ఇప్పుడు మరమ్మతులకు రూ.447కోట్లు ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది కేవలం గత పాలకుల నిర్లక్ష్యంగా చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు అదనంగా రూ. 990కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీ లు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని ఆరోపించారు. ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు వైఎస్ జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు 4విధాలుగా నష్టం జరిగిందని తెలిపారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆగిపోయిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం తప్పిదం జరిగిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు పూర్తిగా నీట మునుగుతాయన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..