తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయాలను వేదికపై పంచుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా తన సతీమణి భువనేశ్వరి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు.. తాజాగా.. సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు వేదికపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు .. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో బుధవారం చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రేమతో రెండు చీరలను కొన్నారు.. ఒకటి ఉప్పాడ జందాని చీర, మరొకటి ధర్మవరం పట్టుచీర ను కొనుగోలు చేశారు. 75 ఏళ్లలో ఏనాడు తాను చీరలను కొనలేదని.. ఈరోజు భువనేశ్వరి గుర్తుకు రావడంతో ఒకటి కాదు రెండు చీరలను కొన్నానని చంద్రబాబు అన్నారు. తనకు నచ్చిన రెండు చీరలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..