ప్రమాదవశాత్తు జరిగిన ఏ ఘటనపై అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందన బాధితులకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. వారు మన రాష్ట్రం వారా, పక్క రాష్ట్రం వారా అన్న సంగతి అటుంచి ఫస్ట్ అయితే హెల్ప్ చేయాలని ఆదేశిస్తారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రొయ్యల చెరువు యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు వీలైనంత వరకు సహాయ, సహకారాలు అందించాలని స్థానిక నేతలకు సూచించారు. బాధిత కుటుంబాలు ఏ సాయం కోరినా, అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పారు. అటు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సాయంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. సీఎం తమ కష్టాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ భరోసా ఇచ్చారు. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ సాయం కావాలన్నా చేస్తారని చెప్పారు.
Also Read: Prakasham District: కన్న కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్.. ఎందుకో తెలిస్తే షాక్