AP CM YS Jagan: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

|

Dec 08, 2021 | 2:55 PM

ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం అని మరోసారి స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్‌తో..

AP CM YS Jagan: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Cm Jagan
Follow us on

AP CM YS Jagan on OTS Scheme: ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం అని మరోసారి స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్‌తో ప్రజలకు ఏరకంగా మంచి జరుగుతుందో చెప్పి, వారికి అవగాహన కలిపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రుణాలు మాఫీ చేసి, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. పేదలపై దాదాపు 10వేల కోట్ల రూపాయల భారాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు.

వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలను కూడా గత ప్రభుత్వం పరిశీలించలేదని విమర్శించారు జగన్. సుమారు 43 వేల మంది టీడీపీ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని చెప్పారు. మరి ఇవాళ ఉచితంగా పట్టాలు ఇస్తామంటున్న వాళ్లు అప్పుడు ఎందుకు కట్టించున్నారని ప్రశ్నించారు. ఓటీఎస్‌ ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని.. అవసరాలకు తనఖా పెట్టుకోవడం, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..