Amaravati Case: కాసేపట్లో సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని కేసు.. విచారణ జరపనున్న ద్విసభ్య కమిటీ..

AP Capital Amaravati Case: ఇవాళ సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రానుంది. ద్విస్వభ్య కమిటీ ధర్మాసనం విచారణ చేయనుంది. అమరావతి రాజధాని నగరం, ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాలు..

Amaravati Case: కాసేపట్లో సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని కేసు.. విచారణ జరపనున్న ద్విసభ్య కమిటీ..
Amaravati Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 11, 2023 | 11:56 AM

అమరావతి, జూన్ 11: ఏపీ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. ఇవాళ సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రానుంది. ద్విస్వభ్య కమిటీ ధర్మాసనం విచారణ చేయనుంది. అమరావతి రాజధాని నగరం, ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం జూలై 11న విచారణ జరుగనుంది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ కావడంతో కొత్త బెంచ్‌కి కేసు బదిలీ అయ్యింది. సుప్రీంకోర్టుకు మే 21 నుంచి జూలై 2 వరకు వేసవి సెలవులు ఉండడంతో పాటు జస్టిస్ జోసెఫ్ జూన్ 16, 2023న పదవీ విరమణ చేయనున్నందున తీర్పును రాయడానికి కోర్టుకు సమయం లేకుండా పోతుందని ధర్మాసనం పేర్కొంది.

మూడు రాజధానుల ఏర్పాటు కోసం రూపొందించిన చట్టాన్ని ఉపసంహరించుకున్నామని, హైకోర్టు తీర్పు ప్రభావమే వాదించాల్సి ఉందని మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. అధికారాల విభజన సూత్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం