Sunil Deodhar: ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ డియోదర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శనివారం కడపలో నిర్వహించిన రాయలసీమ రణభేరీ సభలో సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారినికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించిన సునీల్ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ మోహన్ రెడ్డి కడప అంటే ‘గడప’ అని నువ్వు తెలుసుకోవాలి. తిరుపతి బాలాజీ మందిరానికి కడప, ఒక గడపలాంటిది. ఇలాంటి జిల్లాలో ఒకవేళ వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే ఆంధ్రా హిందువులు సహించరు. టిప్పు సుల్తాన్ ఎంతో మంది హిందువులను చంపాడు, అతని సైన్యం చేతిలో ఎంతో మంది హిందూ మహిళలను అత్యాచారాలకు గురయ్యారు, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు’ అంటూ సునీల్ వార్నింగ్ ఇచ్చారు.
CM @ysjagan, you must be aware that ‘Kadapa’ is actually ‘Gadapa’ (Gate to Tirupati Balaji).
Here, to appease minorities if @YSRCParty tries to install statue of Tipu Sultan, who killed many Hindus & whose army raped thousands of Hindu women, Hindus of Andhra won’t tolerate it. pic.twitter.com/RaloHV7Zlx— Sunil Deodhar (@Sunil_Deodhar) March 19, 2022
Rashi Khanna: నేను కావాలనుకుంది ఒకటి, అయ్యింది మరొకటి.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?