AP Politics: మేమేం తక్కువ కాదన్నట్లు.. ఏపీ రాజకీయ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ మంత్రి..!

|

Oct 20, 2021 | 2:00 PM

AP Politics: ఏపీలో టీడీపీ ఇచ్చిన బంద్‌ ఆందోళనల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఇక నిన్న జరిగిన ఘటనపై..

AP Politics: మేమేం తక్కువ కాదన్నట్లు.. ఏపీ రాజకీయ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ మంత్రి..!
Follow us on

AP Politics: ఏపీలో టీడీపీ ఇచ్చిన బంద్‌ ఆందోళనల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఇక నిన్న జరిగిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మండిపడ్డారు. జగన్‌ బ్యాంకులకు అప్పులు కట్టే పరిస్థితి లేదని, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. విధి లేని పరిస్థితుల్లోనే దౌర్జన్యాలు చేస్తున్నారని, సీఎంను ప్రశ్నిస్తే ఇలాగే ఉంటుందనే హెచ్చరికగా నిన్న జరిగిన దాడులే నిదర్శనమని అన్నారు. అవినీతీ, దౌర్జన్యం, హింసలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగానితనంతోనే దాడులకు తెగబడుతున్నారని, చివరకు హత్యలు కూడా చేయించే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. మంగళవారం జరిగిన దాడులను బీజేపీ ఖండిస్తోందని అన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యం ఆపాలన్నారు. బద్వేల్‌లో భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ నేతలంతా ఉన్నారని, బద్వేల్‌లో దౌర్జన్యం చేసి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు.

టీడీపీ కార్యాలయంపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. గతంలో జగన్ అసభ్యకరంగా మాట్లాడారని, మా జోలికి వస్తే ఇలాగే దాడులు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యాలు చేసి చంపేస్తారా.. అంటూ మండిపడ్డారు.

ఇవీ కూడా చదవండి:

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన పట్టాభి వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు..!

AP Bandh Live: ఏపీలో టీడీపీ బంద్‌.. నేతల నిరసన.. ఉద్రిక్తత వాతావరణం.. టీడీపీ-పోలీసుల మధ్య తోపులాట

AP Bandh: చంద్రబాబు 420.. నీ ఆఫీస్‌లో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా..? కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు