AP E-Crop – Kannababu – AP Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులు సాగు చేసే ప్రతి పంట ఈ-క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రైతన్నలకు విన్నవించారు. వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని కన్నబాబు చెప్పుకొచ్చారు.
సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.
వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టు సాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు తమ సూచనలను అందిస్తాయని మంత్రి వెల్లడించారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని తెలిపారు.
Read also : Peddireddy: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్