AP SSC Result 2023 Date: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే..

|

Apr 23, 2023 | 2:11 PM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షల-2023 మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్పాట్‌ వాల్యుయేషన్ కేంద్రాల్లో దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 26వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ..

AP SSC Result 2023 Date: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే..
AP SSC Results 2023
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షల-2023 మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్పాట్‌ వాల్యుయేషన్ కేంద్రాల్లో దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 26వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇక మూల్యాంకనం పూర్తైన తర్వాత ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్‌ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనాన్ని రాష్ట్ర సంచాలకుడు డి దేవానందరెడ్డి శనివారం (ఏప్రిల్‌ 22) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే రెండో వారంలో అనుకున్న విధంగానే పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రణాళికాబద్ధంగా జరుగుతోందన్నారు. ఈ నెల 26వ తేదీకి స్పాట్‌ వాల్యూయేషన్‌ పూర్తి చేసి మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.