AP Municipal Elections 2021: ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంత అంటే..

|

Mar 10, 2021 | 1:08 PM

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని..

AP Municipal Elections 2021: ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంత అంటే..
Follow us on

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా- 32.64 శాతం
చిత్తూరు జిల్లా-30.12 శాతం
ప్రకాశం జిల్లా-36.12 శాతం
వైఎస్సార్‌ జిల్లా -32.82 శాతం
నెల్లూరు జిల్లా-32.67 శాతం
విశాఖ జిల్లా-28.50 శాతం
కర్నూలు జిల్లా -34.12 శాతం
గుంటూరు-33.62 శాతం
శ్రీకాకుళం-24.58 శాతం
తూర్పుగోదావరి-36.31శాతం
అనంతపురం-31.36 శాతం
విజయనగరం-31.97 శాతం
పశ్చిమ గోదావరి-34.14

 

Read More:

AP Municipal Elections 2021: డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు గల్లంతు.. ఏలూరు ఓటరు లిస్టులో గందరగోళం

Telangana Million March: ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జైతెలంగాణ’ ఆవాజ్‌