కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!

కోట వినుత డ్రైవర్‌ రాయుడు హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినుత భర్త చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు ప్రశ్నలు, అనుమానాలు తెరపైకి తెచ్చారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని వినుత భర్త చంద్రబాబు ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది.

కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!
Kota Vinutha Driver Rayudu Murder Case

Updated on: Jan 04, 2026 | 5:27 PM

కోట వినుత డ్రైవర్‌ రాయుడు హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినుత భర్త చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు ప్రశ్నలు, అనుమానాలు తెరపైకి తెచ్చారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని వినుత భర్త చంద్రబాబు ప్రశ్నించడం చర్చనీయాంశం అవుతోంది.

అసలు.. రాయుడు హత్య సమయంలో తాము చెన్నై ఆస్పత్రిలో ఉన్నామని వినుత భర్త చంద్రబాబు చెప్పుకొచ్చారు. హత్యకు ముందు.. రాయుడు రిలీజ్‌ చేసిన సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని.. తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అన్ని నిజాలు బట్టబయలు అవుతాయని వినుత భర్త చంద్రబాబు హెచ్చరించడం హీట్‌ పెంచుతోంది.

ఇక.. డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్న కోట వినుత దంపతులు.. కొద్దిరోజుల క్రితం బెయిల్‌పై విడుదల‌ అయ్యారు. అప్పటినుంచి డ్రైవర్‌ రాయుడు హత్య కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు.. వినుత భర్త చంద్రబాబు.. ఓ వీడియో విడుదల చేయడం.. అందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టార్గెట్‌గా సంచలన విషయాలు వెల్లడించడంతో ఈ కేసు మరో టర్న్‌ తీసుకుంటోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..