Coronavirus: అన్నెం జ్యోతి కథ సుఖాంతం

| Edited By:

Feb 26, 2020 | 3:09 PM

కరోనా వైరస్‌తో చైనా మొత్తం సతమతమైంది. దీంతో చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన కర్నూలు యువతి అన్నెం జ్యోతి కథ సుఖాంతమయింది. ఆమె క్షేమంగా భారత్ చేరుకుంది. నిజానికి ఈ నెల 19న కర్నూలులో ఆమె వివాహం జరగనుండగా..

Coronavirus: అన్నెం జ్యోతి కథ సుఖాంతం
Follow us on

Coronavirus: కరోనా వైరస్‌తో చైనా మొత్తం సతమతమైంది. దీంతో చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన కర్నూలు యువతి అన్నెం జ్యోతి కథ సుఖాంతమయింది. ఆమె క్షేమంగా భారత్ చేరుకోనుంది. నిజానికి ఈ నెల 19న కర్నూలులో ఆమె వివాహం జరగనుండగా.. అయితే వ్యూహాన్‌లోనే ఉండిపోవడంతో.. పెళ్లి వాయిదా పడినట్టు సమాచారం. అక్కడి భారతీయులను తిరిగి స్వదేశం చేర్చేందుకు మొదట వెళ్లిన రెండు ఎయిరిండియా విమానాలు ఆమెను భారత్‌కు తీసుకొచ్చేందుకు నిరాకరించాయి. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు.

అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్‌కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను ఈ మేరకు అభ్యర్థించారు. చివరకు ఇటీవల వూహాన్ చేరిన ఎయిరిండియా విమానం.. ఇతర భారతీయులతో పాటు అన్నెం జ్యోతిని కూడా ఇండియాకు తీసుకురానుంది. తాను త్వరలోనే స్వదేశాన్ని దర్శిస్తానని ఫోన్ ద్వారా ఆమె వెల్లడించింది.