Anil Kumar Yadav: జగన్‌ ఫ్యామిలీ జోలికి వస్తే .. చంద్రబాబు, లోకేశ్‌లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి

|

Sep 27, 2022 | 10:10 PM

Andhra Pradesh: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గారి కుటుంబం జోలికి ఎవరొచ్చినా తోలు వలిచేస్తానని ఘాటుగా హెచ్చరించారు

Anil Kumar Yadav: జగన్‌ ఫ్యామిలీ జోలికి వస్తే .. చంద్రబాబు, లోకేశ్‌లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి
Anilkumar Yadav
Follow us on

Andhra Pradesh: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గారి కుటుంబం జోలికి ఎవరొచ్చినా తోలు వలిచేస్తానని ఘాటుగా హెచ్చరించారు. దసరా పండుగ అంటే మహిళల పండగ లాగా ఉంటుంది.. అలాంటి పండుగ దినాలలో టీడీపీ నీచపు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆడవారిపై దుష్ప్రచారం చేస్తూ లోకేష్ చంద్రబాబు నీచపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘ నెల్లూరు జిల్లాలో ఒకరు ఈ మధ్య ట్విట్టర్లో తెగ వాగుతున్నారు. ఇంకోసారి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే అసలు ఊరుకోం. ఇలాంటి వారు నేరుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనండి. అంతేకానీ ఆడవాళ్ల జోలికి రాకండి’

‘సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జోలికి ఎవరు వచ్చినా తోలె తీస్తాను. నాకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ముఖ్యం కాదు అవి వస్తుంటాయి,పోతాయి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం’ అని తనదైన శైలిలో రెచ్చిపోయారు అనిల్‌ కుమార్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..