SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 26 నుంచి పరీక్షలు.. వెల్లడించిన విద్యాశాఖ

|

Jun 16, 2021 | 6:45 PM

SSC Exams: దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు చేశాయి. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్‌ అయినట్లు ప్రకటించాయి...

SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 26 నుంచి పరీక్షలు.. వెల్లడించిన విద్యాశాఖ
Follow us on

SSC Exams: దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను సైతం రద్దు చేశాయి. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్‌ అయినట్లు ప్రకటించాయి. ఇక ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించిన ఆయన.. 4వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించాలని సూచించామని, సెప్టెంబర్‌ 2లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని నవీరభద్రుడు తెలిపారు. కాగా, రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్షలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఇవీ కూడా చదవండి

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇదేమి విచిత్రం.. బర్గర్లు ఉచితంగా ఇవ్వలేదని రెస్టారెంట్‌ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు.. చివరకు ఏమైందంటే.!