‘అంత నేరం ఏం చేశాను నాన్నా..’ నిద్రపోతున్న పిల్లాడి గొంతుకోసి దారుణంగా చంపిన కసాయి తండ్రి

అన్యం పుణ్యం తెలియని చిన్న వయసు... లోకాన్ని సరిగ్గా చూడని ఆ బాలుడిని కన్న తండ్రి కర్కోటకంగా అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతుంది.. ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్కూలుకు వెళ్లవలసిన ఆ పసివాడు తండ్రి..

‘అంత నేరం ఏం చేశాను నాన్నా..’ నిద్రపోతున్న పిల్లాడి గొంతుకోసి దారుణంగా చంపిన కసాయి తండ్రి
Father Brutally Murdered His Son

Edited By:

Updated on: Aug 30, 2023 | 11:26 AM

కడప, ఆగస్టు 30: అన్యం పుణ్యం తెలియని చిన్న వయసు… లోకాన్ని సరిగ్గా చూడని ఆ బాలుడిని కన్న తండ్రి కర్కోటకంగా అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతుంది.. ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్కూలుకు వెళ్లవలసిన ఆ పసివాడు తండ్రి గొంతు కోసి చంపడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు

బంధాలు.. బంధుత్వాలు మరచిపోయి మనుషులు మృగాలుగా మారుతున్నారు. కర్కశంగా ప్రవర్తిస్తూ జంతువుల కంటే హీనంగా నడుచుకుంటున్నారు. పిల్లలపై ప్రేమానురాగాలు చూపించాల్సిన తల్లిదండ్రులు రక్తం కళ్ళ చూస్తున్నారు. కన్న తండ్రి కసాయిగా ప్రవర్తించి కొడుకును గొంతుకోసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కమలాపురం మండలపరిధిలోని అగస్త్య లింగాయపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమేశ్వర రెడ్డి(10)అనే బాలుని కన్న తండ్రి శివశంకర్ రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో నిద్రపోతున్న కొడుకును కత్తితో గొంతు కోసి పరారు అయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే సోమేశ్వర రెడ్డి మృతి చెందాడు.

పసివాడు చేసిన పాపం ఏమిటి?

పొద్దును చూడకుండా పొద్దారిపోయిన ఆ బాబు చేసిన పాపం ఏమిటి .. ఎంతో ఆప్యాయంగా చూసుకునే తండ్రే ఆ బాబు పాలిట శాపంగా మారాడు ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేపి ప్రేమతో బడికి పంపించే ఆ తండ్రి తన కన్న కొడుకుని కసాయిలాగా నరికి పీక కోసి చంపడంతో ముక్కుపచ్చలారని సోమేశ్వర్ రెడ్డి అనే బాలుడు చనిపోయాడు. ఏమి తప్పు చేశాడో తెలియదు ఎందుకు చంపాడో కనీసం తండ్రికి కూడా తెలియదు ముక్కుపచ్చలారని ఆ పసివాడి మరణంతో ఆ గ్రామమంతా సోకసంద్రం లేని మునిగిపోయింది ఎంతో ఆప్యాయంగా తిరిగే ఆ తండ్రి కొడుకులకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు గానీ ముక్కు పచ్చలారని ఆ పసివాడి ప్రాణం మాత్రం అద్దాంతరంగా గాలిలో కలిసిపోయింది ఆ తండ్రికి పుట్టడమే ఆ కొడుకు చేసిన పాపము అని ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు సోకసముద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us