జగన్‌కు లోకేష్‌ సవాల్‌..! ఆ కంపెనీకి భూమి కేటాయించినట్లు నిరూపిస్తూ..

ఏపీలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపుపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తే, నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. భూముల కేటాయింపు ధరలపై రెండు పక్షాలూ వేర్వేరు వాదనలు చేస్తున్నాయి.

జగన్‌కు లోకేష్‌ సవాల్‌..! ఆ కంపెనీకి భూమి కేటాయించినట్లు నిరూపిస్తూ..
Ys Jagan And Lokesh

Updated on: Jun 03, 2025 | 11:24 AM

ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. అనేక అంశాల్లో అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్.. భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ.. రూపాయికి మూడు వేల కోట్ల రూపాయిల భూములు ఇస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ వేల కోట్ల భూములు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

లేటెస్ట్‌గా జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఉర్సా కంపెనీకి తక్కువ రేటుకు భూములు ఇచ్చినట్టు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్‌ వేదికగా సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెబితే చాలన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్‌కు కొత్తేమీ కాదన్నారు. ఇక ఉర్సా కంపెనీకి ఏ ధరకు ప్రభుత్వం భూములు కేటాయించిందనే విషయాలను కూడా వివరించారు లోకేష్‌. విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు.

ఉర్సా భూముల విషయంలో వైసీపీ అధినేత పదే పదే విమర్శలు చేస్తుండటంతో.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది కూటమి సర్కార్. అందుకే ఈ అంశంపై కేవలం కౌంటర్ ఇవ్వడం కాకుండా.. మరోసారి ఈ విషయంలో వైసీపీ విమర్శలు చేయకుండా ఉండేలా ధీటైన జవాబు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే జగన్ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ సవాల్ విసిరినట్టు కనిపిస్తోంది. మరి.. లోకేష్‌ సవాల్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి