AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Congress: చేజారిపోతోన్న కీలక నేతలు.. వైసీపీ భవిష్యత్ వ్యూహమేంటి?

YSR Congress: ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీకి పెద్ద దెబ్బ తగలడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీకి పునర్ వైభవం రావాలన్న నాటి పరిస్థితులు పార్టీలో కనిపించాలన్న కూటమి ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించాల్సిన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలకమైన బిల్లులు పరిపాలనాపరమైన జీవోలు

YSR Congress: చేజారిపోతోన్న కీలక నేతలు.. వైసీపీ భవిష్యత్ వ్యూహమేంటి?
S Haseena
| Edited By: Subhash Goud|

Updated on: Jan 25, 2025 | 7:46 PM

Share

ఏపీలో వైసీపీకి మళ్లీ పునర్ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధినాయకత్వం ఆ వైపుగా అడుగులు వేస్తోంది. అందుకు సంస్థగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ ప్రతినిధులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. పార్టీ నిర్ణయాలు, విధివిధానాల పట్ల అవగాహన కలిగిన పార్టీ సీనియర్లను, ఏరి కోరి మరి ఎంపిక చేసి వారికి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా శిక్షణ ఇస్తుంది. అందుకు సీనియర్ జర్నలిస్టులు, పరిపాలనాపరమైన అంశాలపై ,అవగాహన కలిగిన కీలక నేతలతో దిశా నిర్దేశం చేస్తుంది. ఇప్పటి వరకు పార్టీ తరఫున తమ వానిని వినిపిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇకపై పార్టీ అధినాయకత్వ ఆదేశాలతో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పరిపాలన వైఫల్యాలపై తమ గళం వినిపించబోతున్నారు. అందుకోసం వైసిపి ప్రత్యేకంగా ఏరి కోరి మరి కొందరిని నియమించింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా వారికి అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా వాటిని స్పష్టంగా పార్టీ తరపున వైఖరిని ప్రకటించేలాగా అధికార ప్రతినిధులను సిద్ధం చేస్తుంది.

ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీకి పెద్ద దెబ్బ తగలడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీకి పునర్ వైభవం రావాలన్న నాటి పరిస్థితులు పార్టీలో కనిపించాలన్న కూటమి ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించాల్సిన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలకమైన బిల్లులు పరిపాలనాపరమైన జీవోలు, పథకాల అమలు, వాటితో పాటు రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాల విషయంలో తీసుకొచ్చే మార్పులు చేర్పులు తీసుకొచ్చే అంశంలో వైసీపీ తన వైఖరిని తెలియజేయాల్సి ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచన చేయడం వాటిని రద్దు చేయడం మరికొన్నిటిని కొనసాగిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని నాటి టీడీపీ తూర్పార బట్టి అదే విధానాలను అధికారంలో రాగానే మళ్లీ అమలు చేయడం లాంటివి అన్ని సాంకేతికపరమైన అంశాలతో ముడిపడినవి కావడంతో వాటి విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పూర్తిస్థాయి స్పష్టతను ఇవ్వడంతో పాటు కోటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేలాగా తమ పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేసుకుంటుంది వైసీపీ.

నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల విషయంలో సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకోవడం పార్టీ సీనియర్లు ప్రభుత్వ వైఫల్యాల విషయంలో నోరు మెదపకపోవడంతో ఇకపై అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకోసం వైసీపీ ఓటమి తర్వాత పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేస్తూ పార్టీ గొంతుకగా వినిపించేందుకు కొందరిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అందుకు రాజకీయ నేపథ్యం పరిపాలనాపరమైన అంశాల విషయంలో పూర్తి అవగాహన కలిగిన వారిని అధికార ప్రతినిధులుగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వైఎస్ జగన్ నియమించారు. వారీతో పాటు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ వైఫల్యాల విషయంలో సమయం దొరికిన ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకే కీలకంగా కొందరు నేతలను ఎంపిక చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే పార్టీ గొంతు వినిపించే ప్రతి ఒక్కరు తమ వానిని ఎలా వినిపించాలి? ఏయే వేదికలపై వినిపించాలి? ఎవరికి చెరువ కావాలి ? అనే అంశాలపై పూర్తిగా స్పష్టతను ఇస్తోంది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి