గత కొన్ని నెలలుగా క్రమంగా కరోనా వైరస్ అదుపులో ఉందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్ళీ నేనున్నాడంటూ దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దేశంలో వివిధ రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర ల్లో కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతూ ఉండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ జిలాల్లో కరోనాతో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. తాజాగా విశాఖ పట్నం జిల్లాలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
విశాఖ లో మళ్లీ కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో 12 మంది కరోనా బాధితులు వెలుగులోకి వచ్చారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సేకరించిన శాంపిల్స్ లో 12 కోవిడ్ కేసుల నమోదు అయ్యాయి. గత వారం రోజులలో 33 కేసులు నమోదు కాగా వీరిలో 27 మందికి ఇళ్ళల్లో 6 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 7 మంది కోవిడ్ నుంచి పూర్తిగా విముక్తి పొందారు. ఈ కొత్త వేరియంట్ తో ప్రాణాపాయ పరిస్థితులు లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజేశన్ లాంటి వాటిని పాటించాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..