Andhra Weather: ఏపీకి తుఫాన్ ముప్పు..! నేడు  బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్‌కు బంగాళాఖాతం నుంచి మరో ముప్పు దగ్గరపడుతోంది. అండమాన్‌ సమీపంలో అల్పపీడనం ఏర్పడేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే మూడు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం స్పష్టమైంది. వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ...

Andhra Weather: ఏపీకి తుఫాన్ ముప్పు..! నేడు  బంగాళాఖాతంలో అల్పపీడనం
Weather Report

Updated on: Nov 22, 2025 | 7:00 AM

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు. అవును.. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తర్వాత అదే దిశలో పయనిస్తూ.. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే చాన్స్ ఉందట. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  శనివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో చలి నుంచి కాస్త రిలీఫ్ దక్కింది. గురువారం రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.  ఇక అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Follow Us