AP Weather: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో

|

Sep 18, 2022 | 2:02 PM

ఏపీకి వర్ష సూచన వచ్చేసింది. రాబోయే 2 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Weather: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..  ఏపీకి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
Ap Rain Alert
Follow us on

Andhra Rains: రైతన్నలూ అలెర్ట్. లోతట్టు ప్రాంతాల ప్రజలూ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌ ఏర్పడింది. ఇది ఈ నెల 20వ తేదీ నాటికల్లా అల్పపీడనం మారుతుందని వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 18 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళం.. వానలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీరం వెంబడి భారీ గాలులు వీసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చేపల వేటకు ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే వెళ్లినవారు 19వ తేదీ సాయంకాలంలోపు ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే.. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..