Andhra: ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కొత్తగా మార్కాపురం, మదనపల్లెలతో పాటు రంపచోడవం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ... .. ..

Andhra: ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Andhra Government

Updated on: Nov 25, 2025 | 5:05 PM

ఆంధ్రాలో కొత్తగా 3 జిల్లాలు రాబోతున్నాయి. అవును.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకూ అంగీకారం లభించింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయించారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు  చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.