AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: నదిలో తేలుతూ దూరంగా కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా దిమ్మతిరిగింది!

కృష్ణానది ఒడ్డున ఆగి ఉన్న ఓ స్కార్పియో.. దూరంగా నదిలో తేలుతూ కనిపించిన ఓ వ్యక్తి శవం.. వాహనం చుట్టుప్రక్కల చూస్తే..

Vijayawada: నదిలో తేలుతూ దూరంగా కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా దిమ్మతిరిగింది!
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 03, 2023 | 1:03 PM

Share

కృష్ణానది ఒడ్డున ఆగి ఉన్న ఓ స్కార్పియో.. దూరంగా నదిలో తేలుతూ కనిపించిన ఓ వ్యక్తి శవం.. వాహనం చుట్టుప్రక్కల చూస్తే.. ముగ్గురు ఆ ప్రదేశానికి వచ్చినట్లుగా, ఏదో మందు పార్టీ జరిగినట్లుగా ఆనవాళ్లు.. అటుగా వెళ్తోన్న స్థానికులు ఈ తతంగాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసలక్కడ ఏం జరిగింది.? మద్యం మత్తులో నదిలోకి దిగి గల్లంతయ్యారా? ఒకవేళ అదే జరిగితే ఒక డెడ్‌బాడీ మాత్రమే ఎందుకు తేలింది. మిగతా ఇద్దరూ ఉన్నారా.. వాళ్లూ గల్లంతయ్యారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం సస్పెన్స్‌గా మారాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? అక్కడేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా.?

కృష్ణాజిల్లాలోని చోడవరంలో అనుమానస్పద ఘటన జరిగింది. స్థానిక కృష్ణానది పాయ వద్ద ముగ్గురు వ్యక్తులు గల్లంతయినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద స్కార్పియో వాహనంతో పాటు నదిలో ఓ వ్యక్తి డెడ్‌బాడీ తేలుతూ కనిపించడంతో అక్కడున్న స్థానికులు వెంటనే ఖాకీలకు సమాచారం అందించారు. కారులో మద్యం బాటిళ్లు, ముగ్గురికి సంబంధించి విడిచిన బట్టలను పోలీసులు గుర్తించారు. వారంతా కూడా గల్లంతయినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఓ వ్యక్తి డెడ్‌బాడీ మాత్రమే లభ్యం కావడంతో మిగతా ఇద్దరి జాడ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మందుపార్టీ కోసం వచ్చి ముగ్గురూ గల్లంతయ్యారా? లేదంటే ఇంకేదైనా క్రైమా అన్నదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అయితే వచ్చిన ముగ్గురు ఎవరు? శవమై తేలిన ఆ వ్యక్తి ఎవరన్నదానిపైనా ఇంకా క్లారిటీ లేదు. కానీ స్కార్పియో నెంబర్ ఆధారంగా ఆ వాహనం మొగలురాజుపురానికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్