నీట్ వివాదం ఎక్కడ మొదలై ఎటు వెళ్తోంది..? ఏ పార్టీ వైఖరి ఎలా ఉంది?
విద్యార్థుల సంక్షేమం కంటే, విద్యార్థుల శ్రేయస్సు కంటే మాకేదీ ముఖ్యం కాదు.. స్టూడెంట్స్ భవిష్యత్తులతో ఆడుకోవాలన్న ఉద్దేశం మాది కానేకాదు.. అని నీట్ పేపర్ లీక్‌పై తొలిసారి స్పందించారు ప్రధాని మోదీ. ఆయనలా ట్వీట్ చేశారో లేదో, ఇలా 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు అయ్యాయి. బాంబే హైకోర్టు బెంచ్‌ల్లో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఛాంబర్లు సిద్ధమయ్యాయి. నీట్ పేపర్ లీక్‌పై ఇకపై ప్రతిరోజూ ఇక్కడ విచారణ జరుగుతుంది. నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ఇదో కీలక పరిణామం. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇవాళో రేపో చార్జ్‌షీట్ వెయ్యబోతోంది. కానీ, దేశ ప్రతిష్టనే రోడ్డున పడేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీట్‌కి ఈ రిపేర్లు సరిపోతాయా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పంపించాల్సింది షెడ్డుకా లేక గ్యారేజ్‌కా? నీట్ చుట్టూ పోగయిన ప్యాన్ ఇండియా పరేషాన్లపై లోతుగా తెలుసుకుందాం..!

జంతర్‌మంతర్‌లో వేడివేడిగా బొద్దింక, కేంద్ర కేబినెట్‌లో కూల్‌కూల్‌గా విద్యా మంత్రి ధర్మేంద్ర..! ఎవరికివాళ్లు కొండెక్కి కూర్చుని ఇష్యూను ఇజ్జత్‌కా సవాల్‌గా మార్చేశారు. రెండు వైపులా హర్టయిన ఇగోలు బ్యాలెన్స్ అయ్యేదాకా ఈ పీటముడి వీడిపోతుందన్న నమ్మకాలైతే లేవు. కానీ, బొద్దింకకు, ధర్మేంద్రకు మధ్య పెద్దచిక్కు ప్రశ్నగా మారిన నీట్ గురించైతే దేశమంతటా మరోసారి లోతైన చర్చ మొదలైంది. మరోసారి అని ఎందుకన్నామంటే.. నీట్ గురించి మాట్టాడుకోవడాలు కాదు కొట్లాడుకోవడాలే జరిగాయి గతంలో చాలాసార్లు. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రంలో మోదీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అన్నాయి. ఇప్పుడు కాక్రోచ్‌ల సందట్లో సడేమియా అన్నట్టు నీట్ రచ్చ నీటుగా మళ్లీ షురూ ఐందా? వైద్య విద్యలో అడ్మిషన్ల ప్రక్రియను ఎప్పుడో చేతుల్లోకి తీసుకున్నందుకు ఇప్పుడు ఆకులు పట్టుకుంటోంది కేంద్రంలో మోదీ సర్కార్. నిన్నటి దాకా నీట్‌కి వ్యతిరేకంగా పోరాడి పోరాడి అలసిపోయిన రాష్ట్రాలకు మళ్లీ ఊపునిచ్చింది జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ల ఉద్యమం. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ కలుగులోంచి బైటికొస్తాడా రాడా అనేది అటుంచేద్దాం. ఇప్పటికైతే సెంటరాఫ్ కాంట్రవర్సీ ఐన నీట్ భవిష్యత్తు మీదే నీళ్లు జల్లేస్తున్నాయి కొన్ని పార్టీలు. నీట్ పుట్టుకమీదే డౌట్లు పుట్టిస్తోంది లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్. విద్యార్థులకు పరీక్ష బరువు తగ్గించడం, మెడికల్ ఎడ్యుకేషన్ కమర్షియలైజ్ కాకుండా చూడ్డం, వైద్యవిద్య ప్రమాణాలను పెంచడం.. ఈ మూడు ఉద్దేశాలతోనే కదా దేశానికి నీట్ పరిచయమైంది? మరి, ఆ మూడింటిలో ఒక్కటైనా నెరవేరిందా? అన్ని విధాలుగా అట్టర్...
