APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 350 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కొత్త టెండర్లను ఆహ్వానించింది. విశాఖపట్నంలో 100 బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డులో 50, విజయవాడ, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరంలో మరో 50 చొప్పున ఈ-బస్ లు నడపాలని ప్రతిపాదనలు చేశారు. జ్యూడీషియల్ ప్రివ్యూ కమిషన్ జడ్జి అభ్యంతరం మేరకు బస్సుకు రూ. 45 లక్షలు సబ్సిడీ ఇచ్చే ఆలోచనను ఆర్టీసీ విరమించుకుంది.
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్ రూపంలో బస్సుకు రూ. 55 లక్షలు రాష్ట్రానికి అందుతోంది. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు యాభై శాతం తగ్గిన దరిమిలా నిర్వహణ వ్యయం కూడా తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంతో బిఎస్-6 బస్సుల నిర్వహణ వ్యవయం అధికమయ్యింది. ఫలితంగా వీటిని నడపడం భారంగా మారింది.
Also read: