AP SSC Exams: జేఈఈ పరీక్ష(JEE Exams) ల తేదీలను ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా ఆంధప్రదేశ్(Andhra pradesh) లోని టెన్త్ (10Th), ఇంటర్(Inter) పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ మారినట్లు విద్యాశాఖ తెలిపింది. తాజాగా పరీక్షల కొత్త తేదీలను ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నామని తెలిపింది. ఈ ఏడాది కూడా టెన్త్ పరీక్షలను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 27 వ తేదీ – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్)
ఏప్రిల్ 28 వ తేదీ – సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29 వ తేదీ – ఇంగ్లిష్
మే 2 వ తేదీ – గణితం
మే 4 వ తేదీ – సైన్స్ పేపర్-1
మే 5 వ వ తేదీ – సైన్స్ పేపర్-2
మే 6వ వ తేదీ – సాంఘికశాస్త్రం
ఏపీలో మొదట పదవ తరగతి పరీక్షలను మే 2వ తేదీ నుంచి నిర్వహించనున్నామని షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. దీంతో మళ్ళీ టెన్త్ పరీక్షల్లో మార్పులు చేస్తూ.. తాజాగా కొత్త షెడ్యూల్ ని రిలీజ్ చేసింది విద్యాశాఖ.
Viral Video: ఈఫిల్ టవర్ ముందు భారతీయ సంప్రదాయంలో ‘ధోలిడా’ పాటకు డ్యాన్స్.. వీడియో వైరల్