Vizag Crime: ప్రేమలో విఫలం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య!

|

Aug 16, 2023 | 9:07 AM

కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన పి రాంప్రసాద్‌ (30) అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా సాఫ్ట్‌వేర్‌. విశాఖపట్నం సీతంపేట గణేశ్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ శంకరమఠంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ మంగళవారం ఉదయం అతను ఉంటున్న అద్దె ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంప్రసాద్‌ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని..

Vizag Crime: ప్రేమలో విఫలం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య!
P Ramprasad
Follow us on

విశాఖ, ఆగస్టు 16: క్షణికావేశంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చాడు. అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో దొరికిన సూసైట లెటర్‌ ఆధారంగా ప్రేమ విఫలమైన కారణంగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఘటన విశాఖ సీతంపేట గణేశ్‌నగర్‌లో మంగళవారం (ఆగస్టు 15) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన పి రాంప్రసాద్‌ (30) అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా సాఫ్ట్‌వేర్‌. విశాఖపట్నం సీతంపేట గణేశ్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ శంకరమఠంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ మంగళవారం ఉదయం అతను ఉంటున్న అద్దె ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంప్రసాద్‌ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలిలో మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని, అందువల్లనే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు ఉందని ఎస్‌ఐ ధర్మేంద్ర మీడియాకు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ఇవి కూడా చదవండి

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. నలుగురు ఘటనాస్థలంలో అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులందరూ తేనె విక్రయించే కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఈ ఘోరానికి పాల్పడినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.