Ramoji Rao: రామోజీ సైకత శిల్పం.. ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు

| Edited By: Subhash Goud

Jun 08, 2024 | 7:41 PM

మీడయా రంగ దిగ్గజం రామోజీ రావు మరణంతో రాష్ట్రమంతటా స్థానికులు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రముఖులంతా రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే ఆయన మీద ఉన్న అభిమానంతో సైకత శిల్పి సైకత శిల్పాన్ని తీర్చి దిద్దాడు. గుంటూరు జిల్లా సీతానగరంలోని క్రిష్ణా పుష్కర ఘాట్..ప్రతి రోజు చాలా మంది స్థానికులు ఇక్కడకు వస్తుంటారు..

Ramoji Rao: రామోజీ సైకత శిల్పం.. ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు
Ramoji Rao Saikata Sculpture
Follow us on

మీడయా రంగ దిగ్గజం రామోజీ రావు మరణంతో రాష్ట్రమంతటా స్థానికులు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రముఖులంతా రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే ఆయన మీద ఉన్న అభిమానంతో సైకత శిల్పి సైకత శిల్పాన్ని తీర్చి దిద్దాడు. గుంటూరు జిల్లా సీతానగరంలోని క్రిష్ణా పుష్కర ఘాట్..ప్రతి రోజు చాలా మంది స్థానికులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ రోజు వచ్చిన వారందరిని అక్కడున్న సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకొని రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి వర ప్రసాద్ క్రిష్ణా పుష్కర ఘాట్ రామోజీ సైకత శిల్పాన్ని తీర్చి దిద్దారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఈ సైకత శిల్పానికి ఒక రూపం తీసుకొచ్చారు. సాధారణంగా సముద్ర తీరంలో ఇటువంటి సైకత శిల్పాలను తీర్చిదిద్దుతుంటారు. అయితే మొదటి సారి క్రిష్ణా నదిలోని ఇసుకతో రామోజీ సైకత శిల్పాన్ని ఆయన చనిపోయిన రోజు తీర్చిదిద్దడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సినీ, మీడియా రంగాల్లో ఆయన చేసి క్రుషిని శ్లాఘిస్తున్నారు.