Covid Vaccine: వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వండి.. అధికారులకు కీలక సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ సీఎస్..

Covid Vaccine: ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం నాడు విజయవాడలోని సీఎస్ క్యాంపు

Covid Vaccine: వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వండి.. అధికారులకు కీలక సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ సీఎస్..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 9:27 PM

Covid Vaccine: ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం నాడు విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16వ తేదీన చేపట్టనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. ముందుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. కాగా, ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ కోసం 332 సెషన్ సైట్లనుసిద్ధం చేశారు. ఆ మేరకు వ్యాక్సిన్‌లను కూడా పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి 4 లక్షల 77వేల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో వీటిని ప్రభుత్వ అధికారులు అందుకున్నారు.

Also read:

ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు

F3 movie update : ‘ఎఫ్3’ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ డిజిటల్ సంస్థ