AP Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్ని కేసులు వచ్చాయంటే..

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది.

AP Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్ని కేసులు వచ్చాయంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 09, 2022 | 6:38 PM

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 27,522 శాంపిల్స్ ని పరీక్షించగా 1,679 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇక గడిచిన 24 గంటల్లో 9,598 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు కృష్ణా జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇక తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,08,622 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య.. 14,679 కి చేరింది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 22,47,824 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,119 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా లెక్కలు.. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లాలో 225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం – 102, చిత్తూరు – 102, గుంటూరు – 212, వైఎస్ఆర్ కడప – 104, కర్నూలు – 103, నెల్లూరు – 91, ప్రకాశం – 87, శ్రీకాకుళం – 22, విశాఖపట్నం – 128, విజయనగరం – 11, పశ్చిమ గోదావరి – 142 చొప్పున మొత్తం 1,679 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా సమాచారం మీ చేతుల్లోనే.. ● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ●వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also read:

Deepika Padukone: ముద్దు సీన్స్‏లో నటించడానికి మీ భర్త పర్మిషన్ తీసుకున్నారా ? నెటిజన్ ప్రశ్నకు కౌంటరిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..

UP Assembly Election Voting 2022 Live Streaming: యూపీ‌లో రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం.. వారి ఓట్లే కీలకం..

Tirumala: శ్రీవారి భక్తులకు సూపర్ ఆఫర్.. త్వరలో ఆ సేవా టిక్కెట్లు.. కండిషన్స్ అప్లై..