Andhra Pradesh – PRC: కొనసాగుతున్న పీఆర్సీ రచ్చ.. 27న మరోసారి ఉద్యోగులతో చర్చలు..

|

Jan 25, 2022 | 8:05 PM

Andhra Pradesh - PRC: పీఆర్సీ రచ్చకు నేడు కూడా తెరపడలేదు. దీనిపై మరోసారి భేటీ కావాలని మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల

Andhra Pradesh - PRC: కొనసాగుతున్న పీఆర్సీ రచ్చ.. 27న మరోసారి ఉద్యోగులతో చర్చలు..
Follow us on

Andhra Pradesh – PRC: పీఆర్సీ రచ్చకు నేడు కూడా తెరపడలేదు. దీనిపై మరోసారి భేటీ కావాలని మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ అంశంపై మంగళవారం నాడు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రయోజనాలను ఉద్యోగులకు మంత్రుల కమిటీ వివరించింది. జీతాలు తగ్గాయన్న అపోహలను మంత్రుల కమిటీ తొలగించే ప్రయత్నం చేసింది. కాగా, ఈ భేటీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ అంశంపై 27వ తేదీన మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అన్నారు.

నిన్నటి మాదిరిగానే మంత్రుల కమిటీ ఉద్యోగుల కోసం ఎదురు చూసిందని సజ్జల చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని కోరారని, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల. ఏది అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చారని, ఇంత కాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదన్నారు. ఇది ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి అని పేర్కొన్నారు సజ్జల. ఏవైనా మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. మళ్లీ 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని ఆయన చెప్పారు. సీఎం జగన్‌ ఎప్పుడూ ఉద్యోగులకు మేలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశాం’ అని సజ్జల తెలిపారు.

Also read:

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగుంది.. కనిపెడితే మీరే జీనియస్.!

BEML Recruitment 2022: బీఈఎంఎల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000 వరకు జీతం.. వివరాలివే!

Mohan Babu: మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. ఏ పాత్రలో అంటే..