AP Polycet 2023 Postponed: ఏపీ పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా.. త్వరలో కొత్త షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2023 వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఈ మేరకు జూన్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పాలిటెక్నిక్‌ అడ్మిషన్స్‌-2023 కన్వీనర్‌..

AP Polycet 2023 Postponed: ఏపీ పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా.. త్వరలో కొత్త షెడ్యూల్
AP Polycet 2023

Updated on: Jun 02, 2023 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2023 వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఈ మేరకు జూన్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పాలిటెక్నిక్‌ అడ్మిషన్స్‌-2023 కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువును జూన్‌ 5 వరకు గడువు పొడిగించిన కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో చేరికలు, తరగతుల ప్రారంభంపై త్వరలోనే కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తామన్నారు. ఐతే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.

కాగా ఈ ఏడాది మే 10వ తేదీన నిర్వహించిన పాలీసెట్‌ పరీక్షలో దాదాపు 1,24,021 మంది అర్హత సాధించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలను కౌన్సెలింగ్‌ ద్వారా కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.