AP Politics: బీసీల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం.. మరింత ఫోకస్‌ పెట్టిన వైసీపీ

|

Nov 26, 2022 | 7:25 PM

సామాజికవర్గాల పరంగా అత్యధికంగా ఉన్న బీసీల చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే కీలకం. ఒకప్పుడు టీడీపీకి అండగా నిలిచిన..

AP Politics: బీసీల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం.. మరింత ఫోకస్‌ పెట్టిన వైసీపీ
Ap Politics
Follow us on

సామాజికవర్గాల పరంగా అత్యధికంగా ఉన్న బీసీల చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే కీలకం. ఒకప్పుడు టీడీపీకి అండగా నిలిచిన బీసీలపై ఇప్పుడు మరింతగా ఫోకస్‌ పెట్టింది అధికార పార్టీ వైసీపీ. ఈ మూడున్నరేళ్లు ఏం చేశాం, రాబోయే రోజుల్లో ఏం చేయాలన్న దానిపై ప్లాన్లు వేస్తోంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు సీఎంవోలో భేటీ అయి చర్చించారు. డిసెంబర్‌ 8వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 10 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించారు. దీనికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాల తీరు, కొత్త పథకాలు ప్రవేశపెట్టాలా? అన్న దానిపై ఇందులో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ మూడున్నరేళ్లు తమ హయాంలో సామాజిక న్యాయం చేశామని ప్రతిసారీ చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీలకే అత్యధిక శాతం నిధులు, పదవులు ఇచ్చామని లెక్కలతో సహా వివరిస్తున్నారు.

మరోవైపు టీడీపీ కూడా బీసీలపై ఫోకస్‌ పెట్టింది. ఎగుమతులపై ఆంక్షలతో సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగం సమస్యలపై ఇదేం ఖర్మ అంటూ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. బీసీలకు న్యాయం చేశామని చెప్పుకునే వైసీపీ పథకాలన్నీ ఎత్తేసిందని, చివరకు ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీసీలను చంద్రబాబు వెనుకబడి వర్గాలుగానే చూశారని, జగన్‌ మాత్రం బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మారుస్తున్నారని చెబుతున్నారు మంత్రులు. ఈసారి క్విట్‌ బాబు అని బీసీలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి