Andhra Pradesh: పండుగ రోజూ పౌరుషం చూపిన నేతలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో హై వోల్టేజ్‌హీట్

|

Mar 22, 2023 | 5:50 PM

ఉగాది రోజున కూడా పల్నాడు పౌరుషం చూపించారు. కోటప్పకొండపై సమరానికి సై అన్నారు. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఎపిసోడ్‌ చివరికి అరెస్టులకు దారితీసింది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌..

Andhra Pradesh: పండుగ రోజూ పౌరుషం చూపిన నేతలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో హై వోల్టేజ్‌హీట్
Ycp Vs Tdp
Follow us on

ఉగాది రోజున కూడా పల్నాడు పౌరుషం చూపించారు. కోటప్పకొండపై సమరానికి సై అన్నారు. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఎపిసోడ్‌ చివరికి అరెస్టులకు దారితీసింది. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ చదలవాడ అరవింద్‌ బాబు మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం పల్నాడు రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. చివరికి అరవింద్‌బాబుని అరెస్ట్ చేశారు పోలీసులు

గత కొన్నిరోజులుగా అరవింద్‌బాబు, గోపిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతి, అక్రమాలను నిరూపిస్తానని, బహిరంగ చర్చకు కోటప్పకొండకు రావాలని అరవింద్‌ బాబు సవాల్ విసిరారు. కోటప్పకొండకు వెళ్లేందుకు అరవింద్‌బాబు ప్రయత్నించడం టెన్షన్‌కు కారణమైంది. అనుమతి లేదంటూ మొదట హౌ స్ అరెస్టు చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడం, అరవింద్ బాబు మళ్లీ బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో కాసేపు టెన్షన్ తలెత్తింది. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు అరవింద్‌బాబుని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తనను అరెస్ట్ చేయించడం ద్వారా గోపిరెడ్డి పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని విమర్శించారు అరవింద్‌బాబు. ఈ ఆరోపణలకు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు గోపిరెడ్డి. సవాల్‌కి ఎప్పుడైనా, ఎక్కడైనా తాను సిద్ధమని.. కానీ పండుగ వేళ పనిగట్టుకొని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..