Sailajanath Fire: రాయలసీమ ప్రయోజనాలు కాపాడాలి… మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందేః పీసీసీ చీఫ్ శైలజానాధ్‌

|

Jul 09, 2021 | 1:38 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఎపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్‌ తెలిపారు.

Sailajanath Fire: రాయలసీమ ప్రయోజనాలు కాపాడాలి... మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందేః పీసీసీ చీఫ్ శైలజానాధ్‌
Andhra Pradesh Pcc Chief Sailajanath
Follow us on

APCC Chief Sailajanath fire on Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఎపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్‌ తెలిపారు. వైఎస్ జగన్‌ పార్టీ కబుర్లు చెప్పే పార్టీ అని, నీటి రాజకీయాలు చేసే వైసీపీ పార్టీ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతుందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు వైసీపీ నేతలు నిలదీయడం లేదని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచింది, హంద్రీనీవా నుంచి కుప్పం వరకు నీళ్లు తెచ్చింది.. కాంగ్రెస్‌ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 99 శాతం ప్రాజెక్టులు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఎవరి ప్రయోజనాల కోసం వారు స్వార్ధపూరితంగా వ్యవహరించారని శైలజానాథ్ ఆరోపించారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడబడాలని, మా నీళ్లు మాకు రావాల్పిందేనన్నారు. మా మధ్య భేషజాలు లేవంటూ షేక్‌ హ్యాండ్‌లు ఇచ్చుకున్న కేసిఆర్‌, వైయస్‌ జగన్‌లు ఎందుకు మాట్లాడుకోవడం లేదో చెప్పాలన్నారు. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణా, ఆంద్రా ప్రజల్లో టెన్షన్‌ పడితేనే తమకు లాభం అన్నట్టుగా ఇద్దరూ ప్రవర్తిస్తున్నారన్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ, సీఎం వైఎస్ జగన్‌ కరోనా ముసుగులో ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారని శైలజానాథ్ ఆరోపించారు. విశాఖ ఉక్కువంటి ప్రజల ఆస్తులను ప్రధాని కార్పోరేట్‌ సంస్థలకు అమ్ముతుంటే, వైసీపీ నేతలు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. ఆస్తులు అమ్ముకుని పరిపాలన చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలగే, ప్రధాని మోడీ తన మిత్రుడు అదానికి పోర్టులను ధారాదత్తం చేస్తున్నారన్నారని విమర్శించారు. ఆంధ్రా నుంచి ఎగుమతి అవుతున్న పెట్రో, డీజిల్‌ ఉత్పత్తులను స్థానికంగా తక్కువ ధరలకు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని శైలజానాధ్‌ తెలిపారు. విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదిన ఆందోళనలు చేపడతామన్నారు.

Read Also…  Black Magic: ఇంటి ముందు ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు.. హడలిపోయిన కుటుంబసభ్యులు.. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు!